- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ కాలేజీలుగా ఆరు జిల్లాల ఆసుపత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు జిల్లా ఆసుపత్రులు ఇక మెడికల్ కాలేజీలుగా మారనున్నాయి. ఈ మేరకు కన్వర్ట్ చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. గద్వాల, నారాయణపేట్, ములుగు, వరంగల్ జిల్లా నర్సంపేట్, మెదక్, యాదాద్రి జిల్లా భువనగిరిలోని జిల్లా ఆసుపత్రులు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా మారనున్నాయి. ఇక నుంచి డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేయనున్నాయి. ఇదిలా ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పేర్కొన్న ఆరు ప్రాంతాలతో పాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసింది. అయితే కుత్బుల్లాపూర్, మహేశ్వరంలో మెడికల్ కాలేజీకి అవసరమైన సౌకర్యాలు, అనుసంధానంగా ఆసుపత్రులు లేవని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఆరు చోట్ల మాత్రమే కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఇన్ చార్జీ ప్రిన్సిపాల్స్‌ను కూడా నియమించారు.