గర్భిణీకి అబార్షన్ చేసిన బీహెచ్ఎంఎస్ వైద్యురాలు

by srinivas |   ( Updated:2023-04-05 17:38:03.0  )
గర్భిణీకి అబార్షన్ చేసిన బీహెచ్ఎంఎస్ వైద్యురాలు
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్‌ నగరంలో అలోపతి వైద్యులు ఎవరో?, ఆయుర్వేద డాక్టర్లు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయుష్ వైద్యులు ఏకంగా అలోపతి వైద్యుల మాదిరిగా వైద్య సేవలు, శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఇలా వైద్యం చేయడంతో ఓ బాధిత గర్భిణీ ప్రాణాల మీదకు వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అలోపతి వైద్యుల సంఘం (ఐఎంఏ) ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..

నిజామాబాద్ ఖలీల్‌వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బీహెచ్ఎంఎస్ వైద్యురాలు గర్భిణీకి ఆబార్షన్ చేసింది. ఆయుష్ వైద్య విద్యను అభ్యసించిన వైద్యురాలు కనీసం వైద్య విలువలు పాటించకుండా ప్రసూతి నర్సింగ్ హోమ్‌లో చేయాల్సిన సేవలను ఈఎన్టీ ఆసుపత్రిలో అబార్షన్ చేశారు.. అయితే వైద్య నిపుణురాలు అబార్షన్ అసంపూర్తి చేయడంతో బాధితురాలు మరో ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించారు. దీంతో వైద్యం అందించి ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే అబార్షన్ విషయాన్ని బాధ్యులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈఎన్టీ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. అవగాహన లేని వైద్యుల వద్ద చికిత్స చేసుకోకూడదని, ఒకవేళ చికిత్స చేయించుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తెలుసుకోవాలని వైద్య అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed