టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కూపీ లాగుతున్న సిట్..

by Satheesh |
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కూపీ లాగుతున్న సిట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను సిట్ రెండో రోజు విచారిస్తోంది. హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుకలను నిన్న విడివిడిగా ప్రశ్నించిన సిట్ అధికారులు ఆదివారం కూడా నిందితులను విచారిస్తోంది. తస్కరించిన ప్రశ్నాపత్రాలను ఎవరెవరికి ఇచ్చారు. వాటి వెనుక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఏఈ పరీక్ష రాసిన నీలేష్, గోపాల్‌తో పాటు నిందితులకు సహకరించిన మరో ముగ్గురితో మొత్తం మొత్తం తొమ్మిది మంది నిందితులను సిట్ అధికారులు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. విచారణ కోసం నిందితులను ఆరు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణను మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నారు. నిన్న సీన్ రీ కన్ స్ట్రక్షన్ సందర్భంగా టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను అధికారులు విశ్లేషించనున్నారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే కీలక విషయాలు తెలుస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed