- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌కు మరో కీలక నేత రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీ పాలిటిక్స్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తోన్నారు. ఒక పార్టీలో సీటు దక్కకపోవడంతో అసంతృత్తితో పార్టీకి రాజీనామా చేస్తోన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు దక్కలేదనే ఆవేదనతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. దీంతో ఆయనను బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుంటోంది.
పొన్నాల ఎపిసోడ్ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి శనివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరుంది. ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్‌ను సోమశేఖర్ రెడ్డి ఆశించారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో అసంతృప్తితో ఇవాళ సోమశేఖర్ రెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానని, అయినా న్యాయం జరగలేదంటూ సోమశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తున్న క్రమంలో మరో కీలక నేత రాజీనామా చేయడం హస్తం శ్రేణులను ఆందోళన కల్గిస్తోంది. మరికొంతమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన కూడా కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. కాంగ్రెస్‌లో చాలామంది నేతలు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. సీటు దక్కకపోతే వేరే పార్టీలోకి వెళ్లే అవకాశముందనే ఆందోళన కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది.