- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: కేసీఆర్ నిబద్ధత అలాంటిది.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్:‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్(KCR BRSPresident) తెగించిన రోజు నేడు! అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader) అన్నారు. తెలంగాణ దీక్షా దివస్(Telangana Deeksha Divas) సందర్భంగా కేసీఆర్ ఆమరణ దీక్ష గురించి ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రజలే(Telangana People) శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి.. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం ఇది అని తెలిపారు.
ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయని, కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(Pranab Mukherjee) గారు తన ‘The Coalition Years: 1996-2012’ పుస్తకంలో కేసీఆర్ నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారని తెలియజేశారు. కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సమాధానం.. “ప్రణబ్‌జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి.” ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్ అంటూ.. కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ.. కేసీఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ అని హరీష్ రావు రాసుకొచ్చారు.