MLA Beerla Ilaiah Yadav : వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-29 05:50:09.0  )
MLA Beerla Ilaiah Yadav : వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య యాదవ్ (MLA Beerla Ilaiah Yadav)నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ(Sudden inspection) లు చేశారు. స్థానిక జ్యోతిరావు పూలే వసతి గృహన్ని ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తీసుకున్నారు. వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవలే డైట్ చార్జీలు పెంచిందని, నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఇక్కడ హాస్టల్ లో కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు బురద చల్లడం మానుకోవాలన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఇంజక్షన్‌ బాక్స్‌లో గడువు తేదీ ముగిసిన ఇంజక్షన్స్‌ ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థలు, హాస్టళ్లు, పాఠశాలలు,విద్యార్థుల ఎడ్యుకేషన్ వారి ఆహార నాణ్యత పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్లు, విద్యా కమిషన్, విద్యాశాఖ అధికారులు, గురుకులాల సెక్రటరీలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు విద్యా సంస్థలు, హాస్టళ్లు, పాఠశాలలు సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం నాణ్యత లోపిస్తే విద్యాసంస్థలు, హాస్టళ్ల లో, పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయా సిబ్బంది అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 7 వరకు విద్యాసంస్థలు సందర్శించి నివేదిక ఇవ్వనున్న విద్యా కమిషన్. ఈ నేపధ్యంలోమంత్రులు, ఎమ్మెల్యేలు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నారు. కలెక్టర్లు గురుకులాల నిద్ర, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed