- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
mountain snake : అనకాపల్లిలో భారీ గిరినాగు హల్చల్
X
దిశ, వెబ్ డెస్క్ : అనకాపల్లి (Anakapalle ) జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు(mountain snake)హల్చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసింది. రోజువారిగా పొలం పనులకు వెళ్లిన రైతులు ఆ దృశ్యాలను చూసి భయంతో దూరంగా పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం స్ధానికంగా ఎప్పుడు కనిపించని గిరినాగును చూసి భయంతో వణికిపోయారు.
స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించగా వారు గంటపాటు ప్రయత్నించి చాకచక్యంగా భారీ గిరినాగును పట్టుకుని దూరంగా అడవుల్లో వదిలేశారు. దీంతో రైతులు, స్ధానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. గిరినాగును బంధించిన వీడియో వైరల్ గా మారింది.
Advertisement
Next Story