- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్వాల కారు పార్టీలో భగ్గుమంటున్న విభేదాలు..రాసుకుంటున్న ఫ్లెక్సీల రగడ
దిశ,గద్వాల : గత రెండు రోజుల క్రితం దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి ఇన్చార్జిగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ ముందే ఫ్లెక్సీలో తమ ఫోటోలు లేవన్న విషయంలో పార్టీ యువ నాయకులు బాహాబాహీకి దిగారు. దీంతో రంగంలోకి దిగిన ఇన్చార్జి కర్నె ప్రభాకర్ ఇరువర్గాల ఈ విషయంలో కలుగజేసుకుని సర్ది చెప్పగా అప్పటికి సద్దు మణిగిన బాసు హనుమంతు నాయుడు అనుచరులు మాత్రం రాష్ట్ర యువ నాయకుడు కురువ విజయ్ కుమార్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
తాజాగా ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా కురువ విజయ్ కుమార్ గద్వాల పట్టణంలోని పార్టీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సిని చించివేయడంతో వివాదం మళ్ళీ రాజేసుకున్నట్లయ్యింది. తరచూ గద్వాల్ నియోజకవర్గంలో అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలు ఎవరికి వారే నిర్వహిస్తూ మేమంటే మేమే తోపులం అని చూపించుకునేందుకు నియోజకవర్గ బాధ్యతలు మాకంటే మాకే అంటూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు నాయకుల తీరు పై మండి పడుతున్నారు. ఈరోజు జరగబోయే దీక్షా దివస్ లో ఎలాంటి గందరగోళం జరగబోతుందో అంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.