- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదం: కూనంనేని సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాసిచ్చారని, కేసీఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందని ఆరోపించారు. అదానీ, అంబానీలు కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నారని, ఈ కుట్రకు కేసీఆర్ సహకరించారన్నారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
బొగ్గు గనులను ప్రైవేట్ కు అమ్మేస్తున్నారని, ఇప్పటికే కోయగూడెం ఇచ్చేశారన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పిన కిషన్ రెడ్డి ఇటీవల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పాడన్నారు. తాజాగా కొత్త బొగ్గు గనుల ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించే మోడీ కుట్రలో కిషన్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. కిషన్ రెడ్డి సౌమ్యుడుగా ఇన్ని రోజులు అనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేశాడన్నారు.
గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన బొగ్గు గనుల లీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించినందుకు కిషన్ రెడ్డి సిగ్గుపడాలని, సింగరేణినీ కాపాడాల్సిన బాధ్యత సీపీఐ పైన ఉందన్నారు. ఈ క్రమంలోనే జులై 5న బంద్ నిర్వహిస్తున్నామని, 15 రోజుల పాటు నిరాహార దీక్షలు.. కలెక్టరేట్ లను ముట్టడిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలం విషయంలో ధైర్యంగా ఉండాలని, ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.