కొత్త సెక్రెటేరియట్‌లో సంతకాలు.. సీఎం, మంత్రుల ఫైళ్లు ఇవే..!

by Sathputhe Rajesh |
కొత్త సెక్రెటేరియట్‌లో సంతకాలు.. సీఎం, మంత్రుల ఫైళ్లు ఇవే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు. 3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందించే గృహలక్ష్మి, అటవీ గ్రామాల్లోని ఆదివాసీలకు పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించిన పైల్, మరికొన్ని కీలక ఫైళ్లపై పైన ఆయన సంతకం చేయనున్నట్లు తెలిసింది. మంత్రులు సైతం వారికి ముందుగానే నిర్దేశించిన ముహూర్తం ప్రకారం 1.58-2.04 గంటల మధ్య వారి శాఖలకు సంబంధించిన పైళ్ళపై సంతకాలు చేయనున్నారు. కొత్త సచివాలయం ప్రజల ఆకాంక్షలకు, పాలనా సౌకర్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్తు దేశానికే దిశానిర్దేశం చేసే కేంద్రంగా వర్ధిల్లుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏ మంత్రులు వారికి సంబంధించిన శాఖల్లోని ఏ ఫైల్‌పై సంతకాలు చేశారో పరిశీలిస్తే....

ముఖ్యమంత్రి కేసీఆర్ :

సొంత స్థలం ఉన్నవారికి ఇంటిని నిర్మించుకోడానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందించే గృహలక్ష్మి, అటవీ గ్రామాల్లోని ఆదివాసీలకు పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించిన పైల్, మరికొన్ని కీలక ఫైళ్ళపై సంతకం చేయనున్నారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ : జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి రూపొందించిన మార్గదర్శకాల ఫైల్‌పై సంతకం చేయనున్నారు.

ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు : సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్

హోం మంత్రి మహమూద్ ఆలీ : రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేసే ఫైల్‌పై

దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి : జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల ఫైల్‌పై

కార్మిక మంత్రి మల్లారెడ్డి : శ్రమశక్తి అవార్డుల ఫైలుపై

పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ : అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ పైల్‌పై

ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ : రెండో విడత దళితబంధు పధకం ఫైలుఫై

రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌ల నిర్మాణం ఫైలుపై

పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు : ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కేంద్రాలకు మండలాల్లో కొత్త భవనాల నిర్మాణాల అనుమతి ఫైలుపై

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ : ఉచిత చేపపిల్లల, గొర్రెల పంపిణీ, ఎన్సీడీసీ నిధుల విడుదల ప్రతిపాదనలు, మెగా డెయిరీ నిర్మాణానికి 75 కోట్ల గ్రాంట్ ఫైళ్లపై

మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో 1-3 ఏండ్ల వయసు చంటిపిల్లలకు ఉచితంగా పాల పంపిణీ పైల్‌పై సంతకం చేయనున్నారు.

Advertisement

Next Story