షాకింగ్.. స్టార్ హోటల్‌లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

by Ramesh Goud |
షాకింగ్.. స్టార్ హోటల్‌లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్‌లో స్టేట్ ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. నిజామాబాద్ పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటళ్లలో శనివారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జోతిర్మయి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో లహరి హోటల్లో 122 కిలోలు 30 వేల రూపాయల విలువ కలిగిన ప్రమాదకరమైన రంగులను కలిపిన కుళ్లిన చికెన్ ను గుర్తించారు. అంతేగాక ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో నిలువ ఉంచిన ఆహార పదార్ధాలు.. కుళ్లిన మాంసపు ఉత్పత్తులు, కుళ్లిన కూరగాయలను అధికారులు పడేశారు.

అలాగే వంశీ హోటల్లో రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన 24 వేల విలువ కలిగిన చికెన్ ను గుర్తించారు. అంతేగాక హానికరమైన రంగులు కలిపిన మాంసం ఉత్పత్తులు, కాలం చెల్లిన మాసాలాలు, ఉడకబెట్టిన మిర్చి పేస్ట్, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ పరిసరాలను అధికారులు గుర్తించి హోటళ్ల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడిపోయిన ఆహారపదార్థాలు విక్రయించి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అని మండి పడ్డారు. ఇక ఈ రెండు హోటళ్లలో అనుమానాస్పదంగా ఉన్న పదార్ధాల సాంపిళ్ను టెస్ట్ కి పంపించి, ఆయా హోటళ్లకు ఫుడ్ సెఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed