అదానీకి బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్..

by Naveena |
అదానీకి బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్..
X

దిశ,రామన్నపేట : రామన్నపేటలో ఏర్పాటు చేయబోయే ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తమ ప్రాంతంలో పెట్టవద్దని రామన్నపేట ప్రజలు అదానీకి బహిరంగ లేఖ రాశారు.దీంతో ఈ లేక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

"మేము చాలా చైతన్యవంతమైన, ప్రశాంతమైన రామన్నపేట మండల ప్రజలం. మీకు మేము బాధాతప్త హృదయంతో.. విన్నవించు విషయమే ఏమిటంటే మాకు తెలిసి మా రామన్నపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ కు ఆనుకొని మీరు నిర్మించాలనుకుంటున్నా.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ స్థలాన్ని మీరు చూసి ఉండకపోవచ్చు అనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఎన్నో దేశాలు పర్యటిస్తూ ఉంటారు. ఈ పనులన్నీ మీ అధికారులు చూసుకుంటారని మాకు తెలుసు. ఎక్కడెక్కడో మీరు కంపెనీలు, ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు ఎంతో కొంత నిరసన వచ్చి ఉంటది. ఆ నిరసనలకు మేము చేస్తున్న ఈ ఆందోళనకు చాలా తేడా ఉందని మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఏర్పాటు చేయబోయే కంపెనీ నివాస గృహాలకు ఆనుకుని ఉంది. దీనిని మొదటగా మీరు గ్రహించాలని కోరుతున్నాం. రైల్వే స్టేషన్ కు అటువైపుగా ఫ్యాక్టరీ ఇటువైపుగా నివాస గృహాలు ఉన్నాయి. మేమందరం రెక్కాడితే కానీ.. డొక్కాడని ప్రజలం. జ్వరమో, సుస్థి చేస్తే ఆరోజు ఉపాసం ఉండాల్సిన పరిస్థితి. రేపు ఆ కాలుష్యంతో మా ఆరోగ్యాలు దెబ్బతింటే మా కుటుంబాల పరిస్థితి ఏంటో మీరు మానవీయకోణంలో అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. జీవితాంతం కష్టపడి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఫ్లాట్స్ కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నం. భవిష్యత్తులో ఏవైనా బాధలు ఏర్పడితే మేము ఎటు పోవాలి, మా పరిస్థితి ఏంటి..? మీరు దయతో ఆలోచించాలని కోరుతున్నాం. లేదు, నన్ను అడ్డుకునే వారు ఎవరూ లేరు. మేము ఫ్యాక్టరీ కట్టే తీరుతాను అని మీరు భావిస్తే... *మీరు మానవత్వం లేని ఒక కసాయి అని, రాక్షస జాతికి చెందిన వాడివని అనుకుంటాం.. రాక్షస ఆనందం పొందుతున్నావని భావిస్తామని వారి గోడును ఈ బహిరంగ లేఖతో ప్రజలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed