- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూసీ నివాసితులతో సమావేశమైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
దిశ, చైతన్య పురి : చైతన్యపురి డివిజన్ లోని సత్యనగర్ కాలనీ, కొత్తపేట డివిజన్ లోని జనప్రియ అవెన్యూ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ల వినతి మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ఆయా డివిజన్లలోని కాలనీలలో పర్యటించి వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్ని రకాల అనుమతులు తీసుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. తద్వారా మేము ప్రభుత్వానికి ప్రాపర్టీ టాక్స్ లు, కరెంటు బిల్లులు లక్షలలో కట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికి కొన్ని ఇండ్ల మీద బ్యాంకు లోన్స్ ఉన్నాయన్నారు. ప్రస్తుతం మా ఇండ్లు, అపార్ట్మెంట్ లు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్స్ లో ఉన్నాయని మీ ఇండ్లు, అపార్ట్మెంట్ లు కూల్చివేయడం జరుగుతుందని ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మీరే న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ నివసించే కాలనీవాసులు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని అన్నారు. ఇక్కడ ఇండ్లను కూల్చాలంటే మమ్ములను దాటుకొని రావాల్సివస్తుందని, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలు 1964 సంవత్సరం వరకు మూసీ నీళ్లను త్రాగేవారని, రాను రాను మురికి కూపంగా మారిందని నేను ఎమ్మార్ డీసీఎల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని 2020 లో ప్రారంభించామని తెలిపారు. మూసీ బెడ్లపై కొన్ని వేల కోట్ల రూపాయలతో 32 ఎస్టిపి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడుధామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్ రెడ్డి, సాగర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, లింగాల రాహుల్ గౌడ్, సొంటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయ్ గౌడ్, త్రివేది, పలువురు నాయకులు,కాలనీవాసులు పాల్గొన్నారు.