- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతి భద్రతల బాధ్యత కేంద్రానిదే: ఢిల్లీ సీఎం అతిషి
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపింది. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఈ పేలుడు చోటుచేసుకోగా.. సీఎం అతిషి మార్లెనా ఈ ఘటనపై స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం తన 90 శాతం శక్తి సామర్థ్యాలను వినియోగిస్తున్నదని, దానికి బదులు ఢిల్లీలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టడం మంచిదని ఫైర్ అయ్యారు.
‘ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. పోలీసులు, ల్యాండ్, శాంతి భద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వం కిందికే వస్తుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం తన 90 శాతం శక్తిని కేవలం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఉపయోగిస్తున్నది. నిన్న ఓ చోట 60 గన్ షాట్ల శబ్దాలు వినిపించాయి. ఈ రోజు ఏకంగా రోహిణి ఏరియాలో పేలుడు శబ్దాలు వినిపించాయి’ అని అతిషి మీడియా సమావేశంలో వెల్లడించారు.
విద్యా, ఆరోగ్యం, రోడ్లు వంటి తమ రాష్ట్ర ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని ఢిల్లీ ప్రజల తరఫున తాను బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు సీఎం అతిషి పేర్కొన్నారు. ఇందుకు బదులు కేంద్రంలోని బీజేపీ సర్కారు భద్రత, లా అండ్ ఆర్డర్‌ను సమర్థవంతంగా పాలిస్తే చాలని తెలిపారు.