- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTRకు షాక్! సిరిసిల్లలో కౌన్సిలర్ భర్తపై ఫిర్యాదు
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 37వ వార్డు కౌన్సిలర్ దిడ్డి మాధవి భర్త బీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాజుపై మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ నరసింహస్వామి సిరిసిల్ల సిఐ ఉపేందర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 23న మురికి కాలువ నిర్మాణం విషయంలో స్థానిక కౌన్సిలర్ భర్త తాను చెప్పిన విధంగా నిర్మాణం జరగాలని హుకుం జారీ చేసినట్లు బాధితుడు తెలిపాడు.
మురికి కాలువ నిర్మాణం ఇంజనీరింగ్ విభాగానికి విరుద్ధంగా ఉందని అధికారి వాదించగా నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో తిడుతూ... కులం పేరుతో దూషించాడని నరసింహస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ కమిషనర్‌ను సైతం బదిలీ చేయించానని, నువ్వెంత నీ బతుకెంత అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, తనకు అధికారులు ఎన్నికల డ్యూటీ ఇచ్చిన క్రమంలో అందుబాటులో లేక మంగళవారం టౌన్ సిఐ ఉపేందర్‌కు ఫిర్యాదులు అందజేసినట్లు ఆయన తెలిపారు.
మున్సిపల్ ఏఈ నరసింహస్వామికి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఉద్యోగులు అండగా నిలిచారు. సంబంధిత కౌన్సిలర్ భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిక్ సిటీ కేసు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. సదరు వ్యక్తి అధికారులను నిత్యం వేధిస్తూ భూకబ్జాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అసలే అధికారం పోయిందని నిరాశతో ఉన్న కేటీఆర్‌కు కౌన్సిలర్ భర్త నిర్వాకం తలనొప్పిగా మారిందని పట్టణ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.