'రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది'

by Vinod kumar |
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యా వ్యవస్థకి సంబంధించిన అధికారులు లేకపోతే వ్యవస్థలో మార్పూలు ఎలా సాధ్యం అవుతుందని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విద్యా శాఖ నిర్లక్ష్యం పైన సంచలన వాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 600 మండాలాలకు కేవలం 16 మంది మాత్రమే రెగ్యూలర్ MEO లు ఉండటం ఏమిటని.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి జాలి, దయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా బదిలీలు లేకుండా ఒకే దగ్గర పని చేస్తున్న 16 మంది రెగ్యూలర్ ఎమ్ఈఓ లను వెంటనే బదీలిలు చేసి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 మంది రెగ్యూలర్ డీఈఓ లు ఉండాలి. కానీ 10 మంది రెగ్యూలర్ డీఈఓ లు మాత్రమే ఉన్నారి విమర్శించారు. మద్యం పైన ఉన్న ఆసక్తీ విద్యపైన ఎందుకు లేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కనీసం ఈ విషయాలు తెలుసా అంటు ప్రశ్నించారు. వనపర్తి జిల్లాకు కేవలం ఒక MEO మాత్రమే ఉన్నారని.. దాదాపు 20 జిల్లాలకు ఒక్క రెగ్యూలర్ ఎమ్ఈఓ కుడా లేడు అందరు ఇన్ చార్జ్ ఎమ్ఈఓ లు ఉన్నారని అన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్‌లకు ఇన్ చార్జ్ ఎమ్ఈఓ లుగా నాలుగు, ఐదు మండలాలకు బాధ్యతలు ఇవ్వడం వలన విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. 70 వేల పుస్తకాలు చదివిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఈ మాత్రం కూడా తెలియదా అంటు ప్రశ్నించారు. త్వరల్లో విద్యా వ్యవస్థ బాగు కోసం త్వరలో గవర్నర్‌‌ను కలుస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed