- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియాతో మాట్లాడుతూ సొమ్మసిల్లి పడిపోయిన షర్మిల (వీడియో)
దిశ, వైరా : గత నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చిన వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వైయస్ఆర్టీపీ శ్రేణులు ఆమెకు రెండు నిమిషాల సపర్యాయాలు చేశారు. దీంతో రెండు నిమిషాలు ఉపశమనం తీసుకుని మరల మొక్కజొన్న పంటలను ఆమె పరిశీలించారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మల పల్లి గ్రామంలో గత నెల రోజుల క్రితం అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆదివారం వైయస్ షర్మిల పరిశీలించారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10000 నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నెల రోజులు గడుస్తున్నప్పటికీ నేటి వరకు రైతుల ఖాతాలో నగదు జమ కాలేదు. అందుకు నిరసనగా షర్మిల ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న పంటల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తుమ్మల పల్లి గ్రామంలో మొక్కజొన్న పంట పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. షర్మిల ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడి పోయారు. ఆమె పక్కనే ఉన్న జడ్పీ మాజీ చైర్మన్ గడిపల్లి కవిత షర్మిలను పట్టుకొని కింద కూర్చోబెట్టారు. షర్మిలకు వైఎస్ఆర్ సీపీ శ్రేణులు సపర చర్యలు చేశారు. రెండు నిమిషాల ఉపశమనం తర్వాత ఆమె మంచినీరు తాగి వెంటనే మరలా సాధారణ స్థితికి చేరుకున్నారు. అనంతరం ఆమె మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల దయనీయ పరిస్థితిపై ప్రసంగించారు. షర్మిల ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో స్థానిక వైఎస్ఆర్టిపి శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు మండే ఎండ మరోవైపు మొక్కజొన్న పొలంలో ఊక్క పోతకు తట్టుకోలేక షర్మిల కళ్ళు తిరిగి పడిపోయారని వైయస్సార్టీపి శ్రేణులు తెలిపారు.