- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగే దొంగా దొంగా అన్నట్లుగా కేటీఆర్ తీరు: YS Sharmila
దిశ, తెలంగాణ బ్యూరో : దొంగే దొంగా దొంగా అన్నట్లుంది మంత్రి కేటీఆర్ తీరు అంటూ వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర.. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు బీఆర్ఎస్ నేతలే అని ఆరోపించారు. బంగారు తునకపై 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరేనని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి లక్ష కోట్లు కాజేసిన శక్తులు బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్.. పార్టీ 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగులను, పొట్టన పెట్టుకున్న అతీత శక్తులని ఆమె తీవ్ర ఆరోపణలు చేసారు.
రాష్ట్రం పేరు చెప్పి వేల ఎకరాలు కాజేసిన భూ బకాసుర శక్తి అని ఆమె అభివర్ణించారు. తెలంగాణ నినాదాన్ని వక్రీకరించి, నీళ్లను ఫామ్ హౌజ్‌కి పారించి నిధులను సొంత అవసరాలకు తరలించి నియామకాలను కుటుంబానికే ఇచ్చుకున్న బంది పోట్ల రాష్ట్ర సమితినే ఈ రాష్ట్రానికి విచ్ఛిన్నకర శక్తి అని అన్నారు. ప్రజల సొమ్ముతో స్వార్థ రాజకీయలు చేస్తూ, ఉజ్వల తెలంగాణ చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించి ఉద్యమ కారులను అణగదొక్కిన ఘన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుందన్నారు. తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన అసలైన అవకాశవాదులు కల్వకుంట్ల కుటుంబమని ఆమె ఆపార్టీ తీరుపై విమర్శల వర్షం కురిపించారు.