అపోలో హాస్పిటల్‌‌లో దీక్ష కొనసాగిస్తున్న YS Sharmila

by samatah |   ( Updated:2022-12-11 06:36:56.0  )
అపోలో హాస్పిటల్‌‌లో దీక్ష కొనసాగిస్తున్న YS Sharmila
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. గత రెండ్రోజులు దీక్షచేస్తున్న షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆమెను బలవంతంగా దీక్షాస్థలి నుండి హాస్పిటల్‌కు తరలించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్దకు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. షర్మిలను పరిశీలించిన వైద్యులు వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉంది అన్నారు. వైద్యులు చెప్పిన వినకుండా షర్మిల ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రిలో ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. షర్మిల మాత్రం తన మహాప్రస్థాన పాదయాత్రకు అనుమతులు వచ్చేవరకు దీక్ష విరమించబోనని తేల్చిచెప్పారు. పాదయాత్రకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చినా ప్రభుత్వం అడ్డుకుంటుందోని ఆరోపించారు.

Read More....

MLC Kavitha ఇంటివద్ద CBI.. చార్జిషీట్‌లోని వివరాలపై ప్రశ్నల వర్షం

Advertisement

Next Story

Most Viewed