- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సీఎస్‌గా Shantikumari? మరికొద్దిసేపట్లో అధికారిక ఉత్తర్వులు?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఏపీకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో ఆయన రిలీవ్ కావడం అనివార్యమైంది. ఆ స్థానంలో కొత్త సీఎస్‌గా ఎవరిని నియమించాలనే కసరత్తు ప్రగతి భవన్‌లో జరుగుతున్నది. సీనియారిటీ ప్రకారం ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న వసుధా మిశ్రా, రాష్ట్ర కార్మిక విభాగంలో ఉన్న రాణి కుముదినీ ఉన్నప్పటికీ వారి తర్వాతి స్థానంలో ఉన్న శాంతి కుమారికి సీఎస్‌గా బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నది. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంఓలోనూ పనిచేశారు. శాంతికుమారితో పాటు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు పేరు కూడా పరిశీలనలో ఉన్నది. ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దానికి అనుగుణంగా గంటల వ్యవధిలోనే కొత్త సీఎస్ నియామకంపై సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ప్రస్తుతం కొత్త సీఎస్ రేసులో శాంతికుమారి, రామకృష్ణారావు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేసే అవకాశమున్నది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న వసుధా మిశ్రా పదవీకాలం వచ్చే నెలతో ముగియనున్నది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న రాణికుముదినీ ఈ ఏడాది జూలైలో రిటైర్ కానున్నారు. శాంతికుమారి పదవీకాలం 2025 ఏప్రిల్ వరకు ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆర్థిక శాఖ కార్యదర్శి బాధ్యతలు చూస్తున్న రామకృష్ణారావును డిస్టర్బ్ చేయకపోవడమే మంచిదే కోణం నుంచి శాంతికుమారిని సీఎస్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. కాసేపట్లో ప్రభుత్వం సీఎస్ నియామకంపై ఉత్తర్వులు జారీచేయనున్నది.
Also Read...