Shabbir Ali: కేసీఆర్ ఫ్యామిలీకి ఇన్ని ఆస్తులు ఎక్కడివి.. కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్

by Ramesh Goud |
Shabbir Ali: కేసీఆర్ ఫ్యామిలీకి ఇన్ని ఆస్తులు ఎక్కడివి.. కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ కుటుంబానికి(KCR Family) ఇన్ని కోట్ల ఆస్తులు(Assets) ఎక్కడి నుంచి వచ్చాయని, ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కు ఆస్తులు ఎలా పెరిగాయని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Congress Leader Shabbir Ali) ప్రశ్నించారు. గాంధీభవన్(Gandhi Bhavan) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులపై(BRS Leaders) హాట్ కామెంట్స్(Hot Comments) చేశారు. ఎలక్షన్ లో చూపిన అఫిడవిట్ ప్రకారం 2009 లో కేసీఆర్ ఆస్తులు రూ 4.32 కోట్లు ఉంటే 2014 లో అవి రూ.8 కోట్లకు చేరాయని అన్నారు.

ఉద్యమంలో కూడా కేసీఆర్ కు ఆస్తులు పెరిగాయని, ఎవరైనా ఉద్యమం చేస్తే.. ఆస్తులు అమ్ముకుంటారని, కానీ కేసీఆర్ ఆస్తులు సంపాధించుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే 2018 లో అవి 41 కోట్లకు, 2023లో 53 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఇక హరీష్ రావు(Harish Rao)కు 2009 లో రూ.67 లక్షలు ఉన్న ఆస్తులు 2023 కు వచ్చే సరికి రూ. 24 కోట్లకు పెరిగాయని, ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla kavitha)కు 2014 లో రూ.4 కోట్లు ఉంటే ఎమ్మెల్సీ అయ్యే సమయానికి ఆమె ఆస్తులు రూ.39 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఇవన్నీ వారి వ్యక్తిగత ఆస్తులు మాత్రమేనని, కుటుంబం ఆస్తులు చూపించడం లేదన్నారు. తాను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, మంత్రిగా కూడా చేసి ఇంకా అక్కడే ఉన్నానని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఇంత డబ్బు ఎలా వచ్చిందని, దాని వెనుక ఉన్న అల్లాఉద్దీన్ అద్భుత దీపం ఏంటో చెప్పాలని షబ్బీర్ అలీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

Next Story

Most Viewed