- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరిన్ని డయాలసిస్ సెంటర్లు..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అతి త్వరలో మరిన్ని డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 150 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం కోఠిలోని టీజీఎంఎస్ఐడీసీ కార్పొరేషన్‌లో రివ్యూ నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలు, డయాలసిస్ సెంటర్లు పెంపు, టీ హబ్ ల్యాబ్ పరిస్థితిపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల సంఖ్య రెట్టింపు అవుతున్న నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల రిక్వెస్టుల మేరకు డయాలసిస్ కేంద్రాలను పెంచాల్సి ఉన్నదని మంత్రి ఆఫీసర్లతో చర్చించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాల్లో నాలుగు, ఐదు సెషన్స్‌లో నిర్వహించాల్సి వస్తున్నది. దీంతో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువున్న చోట మరిన్ని సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వైద్యారోగ్యశాఖ ఆయా సెంటర్ల ఏర్పాటుకు చొరవ చూపనున్నది. నేషనల్ మెడికల్ కమిషన్ విజిట్ నేపథ్యంలో కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు, స్టాఫ్‌ను సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు టీ డయాగ్నస్టిక్ హబ్స్ అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురానున్నారు. జిల్లా ఆసుపత్రులు ఐసీటీసీ, ఐడీఎప్పీ, టీబీ ఇలా ఈ ల్యాబ్స్‌లలో వేర్వేరుగా శాంపిళ్లు సేకరించి టెస్టులు చేస్తున్నారు. ఇక నుంచి ఇవన్నీ ఒకే చోట పూర్తవుతాయి. అంతేగాక అన్ని రిపోర్టులు ఆన్ లైన్ అందజేయనున్నారు. ఇప్పటి వరకు కేవలం టీ హబ్స్ ల్యాబ్స్‌లోనే ఆన్ లైన్ రిపోర్టులు ఇస్తున్నారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వాసుపత్రుల్లో టెస్టులు చేసినా, అంతా ఆన్ లైన్‌లోనే ఇవ్వనున్నారు. అత్యవసర టెస్టులను కూడా పొందుపరచనున్నారు.