- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్ట్ ఏరియాలో సేవలు.. ఏఎస్సై శోభారాణికి సన్నిహిత సేవ అవార్డు
దిశ, కొత్తగూడ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లకు వివిధ సమస్యలతో న్యాయం కోసం వచ్చే బాధితులకు భరోసా నివ్వడానికి రిసెప్షన్ కౌంటర్లలో పోలీస్ అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిలో కొందరికి డ్యూటీ వేస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్‌కి వస్తున్న బాధితుల సమస్యను వినడమే కాకుండా వారికి పోలీసుల పట్ల మరింత నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవడం వీరి ప్రధాన విధి. రిసెప్షన్ కౌంటర్లలో విధులు నిర్వహించే మహిళా పోలీస్ అధికారులలో బెస్ట్ రిసెప్షన్, సన్నిహిత సేవ అవార్డుకు కొత్తగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే ఏఎస్సై శోభారాణి ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేతులమీదగా అవార్డును ఏఎస్సై శోభారాణి అందుకున్నారు. ఈ సందర్బంగా మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ రిసెప్షన్, సన్నిహిత సేవకు 75 పోలీస్ స్టేషన్‌లు ఎంపికయ్యాయని, అందులో మహబూబాబాద్ జిల్లాలో మూడు ఎంపికైనట్లు తెలిపారు. మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కొత్తగూడ మండలానికి అవార్డు రావటం అభినందనీయమని ఈ సందర్భంగా ఏఎస్సై శోభారాణిని అభినందించారు.