Nandamuri Taraka Ratna : నందమూరి కుటుంబంలో విషాదం నింపిన వరుస మరణాలు..

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-20 05:56:18.0  )
Nandamuri Taraka Ratna : నందమూరి కుటుంబంలో విషాదం నింపిన వరుస మరణాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కుటుంబం తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంది. సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం.. తనదైన మార్క్ పరిపాలన కారణంగా ఇప్పటికి రెండు రాష్ట్రాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. పార్టీలకతీతంగా ఎన్టీఆర్‌ను ఆరాధించే, అభిమానించే రాజకీయ నాయకులు ఉన్నారు. కాగా నందమూరి కుటుంబంలో వరుస మరణాలు విషాదాన్ని నింపాయి. 2014లో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

నిర్మాతగా ఉన్న ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ సైతం రోడ్డు ప్రమాదానికి గురికాగా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం జానకీరామ్ మరణించిన నాలుగేళ్లకు నందమూరి హరికృష్ణ కూడా యాక్సిడెంట్‌లో కన్నమూశారు. ఈ రెండు రోడ్డు ప్రమాదాలు తమ జీవితాల్లో మిగిల్చిన విషాదాన్ని జూనియర్ ఎన్టీఆర్ తరచూ ఆయా సినిమా వేడుకల సందర్భంగా ప్రస్తావిస్తుంటారు.

ఓ అభిమాని మ్యారేజ్‌కు అటెండ్ అయి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టగా హరికృష్ణ స్పాట్‌లోనే కన్నుమూశారు. కాగా గతేడాది ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తాజాగా తారక రత్న..

జనవరి 27న యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. ఆయన చికిత్స కోసం విదేశాల నుంచి సైతం వైద్యులు వచ్చారు. అయినా పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. నటుడిగా కంటే రాజకీయాలపై మక్కువ చూపిన తారకరత్న ఇటీవలే యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగుపెట్టారు.

ఈ క్రమంలో వరుసగా టీడీపీ నేతలను కలుస్తున్నారు. అయితే చంద్రబాబు తో సైతం ఈ సారి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 40 ఏళ్లకే తారకరత్న చనిపోవడంతో అటూ కుటుంబసభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు షాక్‌లో ఉన్నాయి. వేషాధారణలో సైతం అచ్చమైన తెలుగుదనాన్ని నింపుకున్న తారకరత్న ప్రజలకు సేవ చేయాలన్న తన కోరిక తీరకుండానే దివికేగారు.

Also Read..

Chandra Babu, విజయ్ సాయిరెడ్డిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

Advertisement

Next Story

Most Viewed