ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు

by M.Rajitha |
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో నేడు పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు ముఖ్య నేతలే టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అప్పటి తెలంగాణ పీసీసీ(PCC) చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను.. అలాగే బీజేపీ ముఖ్య నేత ఈటెల రాజేందర్ (Etela Rajender) ఫోన్ తోపాటు, ఆయన గన్ మెన్, పీఆర్ఓ, సెక్యూరిటీల ఫోన్లు ట్యాపింగ్ గురైనట్టు విచారణలో తేలింది. 4 నెలల్లో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 80% పైగా ఎయిర్ టెల్ కస్టమర్లు ఉన్నారు. ఎన్నికలకు 15 రోజుల ముందు కాంగ్రెస్ కు చెందిన 190 మంది ఫోన్లను ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు(Praneeth Rao) ట్యాప్ చేయించారని వెల్లడైంది. అనంతరం ట్యాప్ చేసిన 340 జీబీకి చెందిన భారీ సమాచారాన్ని ధ్వంసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది.

Next Story

Most Viewed