- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరికి గ్రూపు-1 ఉద్యోగం
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌కు గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌కు గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. కాగా, ఇటీవల భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. కప్ సాధించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భారత జట్టులో మన రాష్ట్రానికి చెందిన ఆటగాడు ఉండటం గర్వకారణం అని సీఎం ప్రశంసించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు సైతం ఇంటి స్థలం, గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కేబినెట్‌లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.