- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మీరు కడుతున్నది సచివాలయమా? మ్యూజియమా?'
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణంపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ గారూ ,మీరు కడుతున్నది సచివాలయమా? లేక వజ్రవైఢూర్యాలున్న మ్యూజియమా?' అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 300 మంది పోలీసుల జీతం దాదాపుగా ఏడాదికి రూ.18 కోట్లు! అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అది ఎవరి డబ్బు? అని నిలదీశారు. ఇంత చేసి మీరు రోజూ ఆఫీసుకు వస్తారని గ్యారంటీ ఉందా? అని సెటైర్లు వేశారు. ప్రగతిభవన్‌కు వస్తేనే కలుస్తలేరు.. ఇక నూతన సచివాలయానికొస్తే మిమ్ములను కలవనిస్తరా మీ పోలీసులు? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
పోలీస్ ఈవెంట్స్‌లో క్వాలిఫై కాలేదని మంచిర్యాల జిల్లాకు చెందిన పప్పుల రఘు అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై స్పందించిన ఆర్ఎస్పీ నిరుద్యోగులకు కీలక విజ్ఞప్తి చేశారు. 'నిరుద్యోగ మిత్రులారా,ఆత్మహత్యలు ఎన్నటికీ మన సమస్యలకు పరిష్కారం కావు, కాలేవు. మనం జీవించి, పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకొని ఈ నిరంకుశ కేసీఆర్, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే దీనికి అసలైన పరిష్కారం. మీరు నిరాశకు గురైనట్లయితే, దయచేసి రోష్ని ఎన్జీవో హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి 04066202000'అంటూ మరొక ట్వీట్లో పేర్కొన్నారు.