పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ఓకే.. ఈటల కూడా వస్తే మంచిది: రేణుకా చౌదరి

by GSrikanth |   ( Updated:2023-06-26 17:02:08.0  )
పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ఓకే.. ఈటల కూడా వస్తే మంచిది: రేణుకా చౌదరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరికలపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అధిష్టానం అంగీకరించిన వాళ్ళందరూ పార్టీలోకి వస్తారన్నారు. ఎవరు పార్టీలోకి వచ్చినా తాను ఆహ్వానిస్తానని చెప్పారు. పొంగులేటి రాకను తాను వ్యతిరేకించలేదని చెప్పారు. తాజా భేటీలో మా మధ్య సీట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని సీట్ల విషయంలో ఆయన ఏ డిమాండ్లు చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో ఆశించేవారు ఆకాశమంత ఉంటారని కానీ కొందరికే అవకాశాలు వస్తాయన్నారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఇంటి వ్యవహారం అని కొట్టిపారేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారన్న విమర్శలపై బీజేపీలో కోవర్టులు లేరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ చాలా బాగుందన్నారు. సౌత్‌లో బీజేపీ ఆటలు సాగవన్నారు. బీజేపీలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు నరకం అనుభవిస్తన్నారని.. రానున్న రోజుల్లో ఆశ్చర్యపడేలా కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయన్నారు. సౌత్ సెంటిమెంట్ మోడీ, అమిత్ షా, నడ్డాలకు అర్థం కాలేదన్నారు. సౌత్ ఇండియాతో చెలగాటం అడొద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటి సంచలన ప్రకటన

Advertisement

Next Story