- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి కూర్చీని కోమటిరెడ్డి లాక్కుంటారు.. MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందో.. పోతుందో కూడా తెలియని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాక్కుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డే కాదు.. ఆ కుర్చీ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ ఒక్కటే అని అభిప్రాయపడ్డారు. ఇద్దరూ కలిసే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రైతుబంధు నిధుల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.2 వేల కోట్లు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రూ.3 వేల కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. 14 సీట్లకు పైనే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు ఒక అభ్యర్థిని డిసైడ్ చేయడం కాదని.. స్వయంగా వారిద్దరిలో ఒకరు పోటీ చేసినా తానే గెలుస్తామని అన్నారు. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ రాబోతోందని జోస్యం చెప్పారు. హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేశారు. కావాలనే ఎన్నికల వేళ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.