చంద్రబాబు ను గుర్తు చేస్తున్న కేసీఆర్ కరెంట్ కోతలు'

by samatah |   ( Updated:2023-02-09 10:08:42.0  )
చంద్రబాబు ను గుర్తు చేస్తున్న కేసీఆర్ కరెంట్ కోతలు
X

దిశ , డైనమిక్ బ్యూరో: వ్వవ సాయ రంగానికి నిరంతర ఉచిత విద్యత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెబుతోందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 24 గంటల విద్యుత్ విషయంలో సభా వేదికగా కేసీఆర్ అండ్ కో చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు అసలు పొంతన ఉండటం లేదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై షర్మిల గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంట్ జాడ లేదని కరెంట్ కటింగ్ లపై రైతుల ఫోన్లకే మెసేజులు వస్తున్నాయని ఇది సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతన్నల ఆందోళనలు సీఎం కంటికి కనిపించడం లేదని ఆరోపిచారు. రబీ సీజన్ లో సాగులో మొత్తం 50 లక్షల ఎకరాలు సాగు అవుతుంటే అందులో 30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని ధాన్యం కొనడం ఇష్టం లేక విద్యుత్ కోతలతో పంటలు ఎండబెట్టే కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2004 కంటే పూర్వపు పరిస్థితులు నెలకొన్నాయని కరెంట్ కతల విషయంలో కేసీఆర్ సర్కార్ తీరు చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తోందన్నారు. త్రీ ఫేజ్ కరెంట్ లేక పంటపొలాలు ఎండి రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకున్నారో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 నుంచి 7 గంటల విద్యుత్ తో చివరి మడి వరకు నీళ్లు అందక కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు విలవిలలాడుతున్నారని అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు ఎట్లో రాయి తీస్త అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని ఫైర్ అయ్యారు. స్వష్ట్రంలో 24 గంటల కరెంట్ కు దిక్కులేదు ఇక దేశమంతటా ఇస్తడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగం పక్షాన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed