- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అరేయ్ బిడ్డ నేను KCR శిష్యుడిని.. వంద కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదు’: MLA కౌశిక్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: అరేయ్ బిడ్డ నేను కేసీఆర్ శిష్యుడిని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మీరు ఇలాంటి వంద కేసులు పెట్టిన కూడా.. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము కేసీఆర్ నాయకత్వంతో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ఇంకో సంవత్సరం ఆగితే డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి కాన్వాయికే అడ్డం తిరుగుతాం.. ఏం చేస్తారో చేసుకోండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి పై రెండ్రోజుల క్రితం క్రిమినల్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. భారత్ న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినే. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సిఈవో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు. దీంతో ఆయనపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం అమలులోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు అయింది.