- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతల తిరుగుబాటు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కమిటీల అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు రేవంత్ రెడ్డి నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కావద్దని సీనియర్లంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నేడు గాంధీభవన్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి సీనియర్లు గైర్హజరయ్యారు. అయితే, సీనియర్ల నిర్ణయాన్ని కాదని.. అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి రేవంత్ అధ్యక్షతన జరుగుతోన్న మీటింగ్‌కు హాజరుకావడం గమనార్హం. అంతేకాకుండా పార్టీలో జరుగుతోన్న సంక్షోభంపై కూడా జానారెడ్డి స్పందించలేదు. పార్టీకి సంబంధించిన ఏ విషయాన్ని తాను బయట మాట్లాడనని.. ఏం ఉన్నా అంతర్గతంగానే చర్చిస్తామని తెలిపారు. పీసీసీ కమిటీల విషయంలో గతంలో కూడా ఎన్నో గొడవలు జరిగాయని.. ఇదేమి కొత్త కాదని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేత అయినా జానారెడ్డి.. సీనియర్ల పక్షాన కాకుండా రేవంత్ మీటింగ్‌కు హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది