బీసీ క్రిమిలేయర్ ​ఎత్తివేయాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

by Javid Pasha |
బీసీ క్రిమిలేయర్ ​ఎత్తివేయాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ క్రిమిలేయర్​ను ఎత్తివేయాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కులగణన చేయాలని, బీసీ క్రిమిలేయర్ ఎత్తేయాలని గతంలో ఎన్నిసార్లు మోడీని కోరినా స్పందించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఓబీసీల్లో ఇదే డిమాండ్ ఉన్నదన్నారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకం అనేది మరోసారి స్పష్టమైందన్నారు. అధికారంలోకి రాగానే బీసీ జనగణన జరుపుతామని, రిజర్వేషన్స్ పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నెల 25న బీసీ సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. బీసీలను పార్టీకి దగ్గర చేసుకునే ఎజెండా తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed