కామ పిశాచికి టికెట్ ఎలా ఇస్తారు.. బెల్లంపల్లిలో ఎట్లా గెలుస్తాడో చూస్తా: శేజల్ సవాల్

by Satheesh |   ( Updated:2023-08-22 10:36:57.0  )
కామ పిశాచికి టికెట్ ఎలా ఇస్తారు.. బెల్లంపల్లిలో ఎట్లా గెలుస్తాడో చూస్తా: శేజల్ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ను మరోసారి దుర్గం‌ చిన్నయ్యకు కేటాయించడంపై అరిజన్ డైయిరీ ప్రతినిధి శేజల్‌ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‌కామా పిశాచికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కామ పిశాచి, చీటర్‌కు లైసెన్స్ ఇచ్చి నీకు అడ్డులేదు రెచ్చిపో, ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు.. అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దుర్గం చిన్నయ్య భవిష్యత్తులో మహిళలను వేధించకుండా ఉంటారని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తాను గత ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు న్యాయం జరగకుండా టికెట్ ఎలా ఇస్తారని శేజల్ ప్రశ్నించారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తారో చూస్తానని శేజల్ సవాల్ విసిరారు. బెల్లంపల్లిలో ఇంటింటికి తిరిగి అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు.

Read More : బోరున విలపించిన MLA రాజయ్య.. అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని కన్నీరుమున్నీరు

Advertisement

Next Story

Most Viewed