- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ T- బీజేపీ కీలక నిర్ణయం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీసుకు భద్రత పెంచింది. 18 మంది ప్రైవేట్ సిబ్బందితో సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ కార్యాలయానికి ముప్పుందని గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు భద్రతా లోపాలున్నాయని, వాటిని సరి చేసుకోవాలని ఇంటలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో భద్రత బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీజేపీ నేతలు వాదించినా.. తెలంగాణ సర్కారు మాత్రం స్పందించలేదు.
దీంతో బీజేపీనే భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంది. పార్టీ ఆఫీసులో మెటల్ డిటెక్టర్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జాతీయ నేతలు, కేంద్రమంత్రులు కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుండి బీజేపీ కార్యాలయం పూర్తిగా ప్రైవేట్ భద్రతా సిబ్బంది చేతుల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం.
Also Read..