ఈ నెల 15నే సికింద్రాబాద్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం

by Javid Pasha |   ( Updated:2023-01-27 11:06:58.0  )
ఈ నెల 15నే సికింద్రాబాద్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 15నే సికింద్రాబాద్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సంక్రాంతి తర్వాత జనవరి 18న పీఎం మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని అంతకుముందు అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ ఈ కార్యక్రమాన్ని 3 రోజులు ముందుకు జరిపినట్లు మంత్రి చెప్పారు. ఈ నెల 15న ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభింస్తారని పేర్కొన్నారు. ఈ నెల 19న ప్రధాని పర్యటన వాయిదా నేపథ్యంలో ఈ కార్యక్రమం ముందుకు జరిపినట్లు ఆయన తెలిపారు. కాగా.. సికింద్రాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

Advertisement

Next Story