- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్!.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ది చేస్తామని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను గెలిచినప్పటి నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను 720 కోట్లతో రీమోడల్ చేసి టోటల్ గా డెవలెప్ చేస్తున్నామని తెలిపారు.
అంతేగాక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సెంట్రల్ ఏసీతో ఏ విధంగా ఉంటుందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా సెంట్రల్ ఏసీతో రాబోతోందని అన్నారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి అయ్యాయని, రైళ్ల రాకపోకలు ఆగకుండా.. ప్యాసింజర్ల ప్రయాణాలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు జరగాల్సి ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోందని, 2025 కల్లా ఆధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతోందని స్పష్టం చేశారు. ఒక్క సికింద్రాబాద్ లోనే గాక తెలంగాణ రాష్ట్రమంతా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు.