- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సగం మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇంటికే.. మళ్ళీ అవకాశమివ్వని ఇరిగేషన్ శాఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పలు శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఇంకా వేర్వేరు స్థాయిల్లో విధుల్లో కొనసాగుతుండడంపై చర్చ జరుగుతున్న సమయంలో సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే పదవీ విరమణ చేసినా వివిధ కారణాలతో ఇంకా బాధ్యతల్లో ఉన్నవారి వివరాలను ఇటీవల సేకరించిన కార్యదర్శి రాహుల్ బొజ్జా కొందరిని ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్న పలువురు అధికారుల్లో వారి అవసరాలు, సేవలను దృష్టిలో పెట్టుకుని కొందరిని కొనసాగిస్తూ మరికొందరిని రిలీవ్ చేయాలని భావించారు. అందులో భాగంగా కీలక బాధ్యతల్లో ఉన్న మొత్తం 72 మంది వివరాలను సేకరించి ఇటీవల నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు. వీరిలో 34 మందిని విధుల నుంచి పంపించేలా ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరిని ఈ ఏడాది చివరి వరకూ కంటిన్యూ చేసి ఆ తర్వాత ఎక్స్ టెన్షన్ ఇవ్వకుండా సరిపెట్టాలనుకుంటున్నారు.
ఇంజినీర్-ఇన్-చీఫ్‌లుగా ఉన్న మురీళధర్, నల్లా వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజినీర్ హమీద్‌ఖాన్, సూపరింటెండింగ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరో ముగ్గురు ఎస్ఈలను, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సర్వీస్ నుంచి డిస్‌కంటిన్యూ చేస్తూ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అడ్వయిజర్‌గా ఉన్న పెంటారెడ్డి పదవీకాలం మే 16 నుంచి ఆరు నెలల కాలం పాటు కొనసాగుతుందని ఇప్పటికే ఉత్తర్వులు జారీ కావడంతో ఆ ప్రకారం నవంబరు 15 వరకు సర్వీసులో ఉండనున్నారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల విభాగంలో కన్సల్టెంట్‌గా ఉన్న మహబూబ్ హుస్సేన్, మరో కన్సల్టెంట్ శ్రీనివాసులు, టెక్నికల్ జనరల్ మేనేజర్ దేవసహాయం, డిప్యూటీ ఈఈ సయ్యద్ రియాజ్ హైదర్‌ను కూడా సాగనంపేలా నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 72 మంది సర్వీసును పరిగణనలోకి తీసుకున్న ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా 34 మందిని (రిజైన్ చేసిన పలువురితో కలిపి) వెంటనే విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించి మరికొందరిని మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్‌మెంట్‌లు జరగాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొనసాగించాలని నిర్ణయించారు.