- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26న సాయంత్రం 4గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ నిర్వహిస్తామన్నారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారన్నారు. ఈ బహిరంగసభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఖర్గే విడుదల చేస్తారని తెలిపారు. ఈ నెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు.
ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతీ గడపకు చేరాలి... ప్రతీ తలుపు తట్టేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కోఆర్డినేటర్లను నియమించామన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్ వరంగల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు. మేనిఫెస్టో విడుదలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు వివరిద్దామన్నారు.