ఫలితాలపై దృష్టి సారించాలి.. సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌

by Javid Pasha |
ఫలితాలపై దృష్టి సారించాలి.. సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్పోర్ట్స్‌ స్కూల్స్, అకాడమీలు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దృష్టి సారించాలని, అకాడమీల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలోని చైర్మన్‌ కార్యాలయంలో సోమవారం రాష్ట్రంలోని క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ.. క్రీడా అకాడమీలకు కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం కల్పిస్తున్నదన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్లపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. క్రీడా, విద్య, శిక్షణ మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాల్లో కూడా వారికి నిపుణులతో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ అకాడమీలలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా, నిర్దిష్ట లక్ష్యాలతో అకాడమీలను నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్లు, జిల్లా క్రీడా సంస్థలు అంతర్గత ఆడిట్‌ను పూర్తి చేసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఓఎస్‌డీ కె. లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్‌ జి. చంద్రారెడ్డి, ఏఎస్‌డీ కె. నర్సయ్య, డీవైఎస్‌ఓ జి.అశోక్‌ కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ. అశోక్‌ కుమార్‌, డీవైఎస్‌ఓలు పరందమ్‌ రెడ్డి, సుధాకర్‌ రావు, వెంకటేశ్వర్‌ రావు, అథ్లెటిక్‌ కోచ్‌ ఎం.డీ. గౌస్‌, బీఈ షాలిని ప్రియ, అకాడమీ ఇన్ చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed