అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సర్కార్ కీలక ఆదేశాలు

by M.Rajitha |   ( Updated:2024-09-26 10:05:18.0  )
అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సర్కార్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పనిసరిగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫోటో ఏర్పాటు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సెలెక్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 7 లోపు తప్పకుండా సీఎం ఫోటో పెట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తైనప్పటికీ ఇంతవరకూ కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో లేకపోవడంపై పలువురు నాయకులు ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించగా.. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ అక్టోబర్ 7 వరకు గడువునిచ్చింది. సీఎం ఫోటో ఏర్పాటు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించింది.





Advertisement

Next Story

Most Viewed