- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ముఖ్యమైనది ఆరు గ్యారంటీలు(Six Guarantees). ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma Houses) ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైనది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా చేపట్టేందుకు ఒక ప్రత్యేక యాప్(App) డిజైన్ చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Pongulety Srinivas) ప్రకటించారు. త్వరలోనే లబ్దిదారులను ఎంపిక చేసి, వారికి నాలుగు దశల్లో ఇళ్ల కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇళ్ళు 400 చదరపు అడుగుల వైశాల్యంతో ఉంటుందని తెలిపారు. ఇక సొంత స్థలం ఉన్న లబ్దిదారులకు దశల వారీగా రూ. 5 లక్షలు వారి అకౌంట్లలో జమ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులుగా ఇంటి యజమానిగా మహిళలను ఎంపిక చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.