- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING : పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం.. నానా తంటాలు పడుతున్న ప్రయాణికులు
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రాకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పండగ వాతావరణం నెలకొంది. కాస్త స్తోమత కలవారు తమ సొంత కార్లలో సొంతూళ్లకు పయనం కాగా, పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక యువత తమ బైక్‌లపై స్నేహితులతో కలిసి పండుగకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజాల వద్ద విపరీతంగా ట్రాఫిక్ జాం అవుతోంది. పండుగకు రెండు రోజులే సమయం ఉండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజాకు నిన్న మధ్యాహ్నం నుంచి వాహనాల తాకిడి పెరిగింది. పండుగకు పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని జీఎంఆర్ సిబ్బంది విజయవాడ వైపు వెళ్లే.. వాహన లైన్ల సంఖ్య పెంచినా ఏ మాత్రం రద్దీ తగ్గడం లేదు. టోల్‌ప్లాజాలో కొన్ని వాహనాకలు ఫాస్ట్‌ట్యాగ్ లేకపోవడంతో సమస్య అత్యంత జఠిలంగా మారింది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వారి నుంచి సిబ్బంది మాన్యువల్‌గా రుసుము వసూలు చేసి వాహనాలకు విజయవాడ వైపు అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బస్సులు, కార్లలోని ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అందులో మహిళలు, పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.