బైబిల్, ఖురాన్, భగవద్గీత పోయి దేవుళ్లపై ఓట్టు వరకు వచ్చింది.. కాంగ్రెస్ పై బండి సంజయ్ సెటైర్

by Prasad Jukanti |
బైబిల్, ఖురాన్, భగవద్గీత పోయి దేవుళ్లపై ఓట్టు వరకు వచ్చింది.. కాంగ్రెస్ పై బండి సంజయ్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరుగు, తాళ్లు, తేమ లేకుండా పండించిన ప్రతి ధాన్యం గింజా కొంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు పేరుతో రైతుల వద్ద తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తోందని ఇది దేవుళ్లను అవమానించినట్లే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేవుల్ల మీద ఓట్టు కోరుతున్నారని భగవద్గీత పోయి దేవుళ్ల మీదకు వచ్చారని ఎద్దేవా చేశారు. తడిసిన ధాన్యాన్ని దళారులు తరుగు పేరుతో మోసం చేస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన.. అకాల వర్షాలతో ధాన్యం కేంద్రాల్లో వడ్లు తడిసిపోయినట్లు చెప్పారు. కొన్ని చోట్ల కొంత వరకే ధాన్యం తడిసిందని అధికారులే చెప్పినప్పటికీ దళారులు మాత్రం 6 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు, దళారులు గంపగుత్తగా తక్కువ చేసి కొనుగోలు చేయడం రైతులకు అలావాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను మోసం చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని విమర్శించారు. రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని, రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆగస్టు 15న రుణమాఫీ ఎందుకు చేయడం లేదని, ఇప్పుడు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. తరుగు లేకుండా రైతుల వద్ద నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి రూ.700 కోట్లు ఖర్చు వస్తే రుణమాఫీ చేయడానికి దాదాపు రూ.30 వేల కోట్ల ఖర్చు అవుతుందన్నారు. రుణమాఫీకి లేని ఇబ్బంది ధాన్యం కొనుగోలుకు ఏమొచ్చిందని నిలదీశారు. బోనస్ కిందా రైతులకు రూ.500 ఇస్తే రూ.50 వేల కోట్లు ఖర్చు వస్తుందని బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఆగస్టు 15న రూ.30 వేల కోట్ల ఖర్చుతో ఎలా రుణమాఫీ చేయబోతున్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed