- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సనాతన సాహిత్యం.. గోండు భాషలో భారతం.. మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర ట్వీట్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించి "పండోక్న మహాభారత్ కథ" పేరిట పుస్తకంగా తీసుకొచ్చిన తొడసం కైలాస్, మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి, పుస్తకాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించానని తెలిపారు. భవిష్యత్తులో భారతీయ సనాతన సాహిత్యం విషయంలో ఈ ప్రయత్నం కొనసాగించాలని సూచించానని తెలిపారు.
ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కైలాస్, గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేసేందుకు గోండు భాషలో రచించి చేసిన ప్రయత్నం అభినందనీయమైనదని పేర్కొన్నారు. ఏ విషయమైనా మాతృభాషలో తెలుసుకుంటే అది మనసుకు హత్తుకుంటుందని వివరించారు. ఈ చొరవ ద్వారా భవిష్యత్ తరాలకు మహాభారతం మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Advertisement
Next Story