- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మహాలక్ష్మి’కి 300 రోజులు.. 90 కోట్ల మంది మహిళల ప్రయాణం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి ఆదివారంతో 300 రోజులు పూర్తయ్యాయని, ఇప్పటివరకు ఈ ఫ్రీ బస్సు సర్వీసును రాష్ట్ర వ్యాప్తంగా 90కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సజ్జనార్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి ప్రసంగించారు.
అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. ‘‘ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉంది. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి పథకం.. ఈ రోజు (ఆదివారం)తో 300 రోజులకి చేరింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది మహిళలు ఈ ఫ్రీ బస్ సర్వీసును వినియోగించుకుని ఉచితంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. అనంతరం బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, వీసీ సజ్జనార్ ప్రయాణించారు.