- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు సొమ్ము కాంట్రాక్టర్ల జేబుల్లోకి? సీఎం సమాధానం చెప్పాల్సిందే
X
దిశ, డైనమిక్ బ్యూరో: రైతు బంధు నిధులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సోమవారం ఆసక్తికర పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కోసం కేటాయించిన రూ. 7 వేల కోట్లు ఎటు పోయినయి? అని ప్రశ్నించింది. రైతులకు అందాల్సిన డబ్బు కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయిందా? అని నిలదీసింది.
ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి రైతుబంధు పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్, పంటకాలం పూర్తయినా కూడా.. ఇంకా రైతులందరికి పెట్టుబడి సాయం అందలేదని పేర్కొంది. రైతు బంధు సొమ్ము ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. పూటకో మాట రోజుకో అబద్ధం చెప్తూ రైతుబంధు ఎగబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చింది.
Advertisement
Next Story