- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ క్రికెట్ లవర్స్‌కు ఆర్టీసీ, మెట్రో గుడ్ న్యూస్..!
దిశ, డైనమిక్ బ్యూరో: మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ లో కొత్త జోష్ నిండింది. మ్యాచ్ లను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ వివిధ జట్ల మధ్య జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడిపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 2, 9, 18, 24 మే 4, 13, 18 తేదీల్లో జరగబోయే మ్యాచ్‌ల సందర్భంగా ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం మీదుగా ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు అదనంగా 60 ప్రత్యేక బస్సులను నడపబోతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి మధ్యాహ్నం 1:30 నుంచి 8:30 గంటల మధ్య ఈ బస్సులు నడుస్తాయని మ్యాచ్ పూర్తయిన అనంతరం ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేల అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రేక్షకులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
రేపటి మ్యాచ్ కోసం మెట్రో ఫ్రీక్వెన్సీ పెంపు:
ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12:30 నుంచి ట్రైన్స్ ఫ్రీక్వెన్సీని పెంచుతామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం తెలిపారు. ప్రేక్షకులు మెట్రో సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.