RS Praveen Kumar: కృష్ణయ్య కుటుంబాన్ని కలిసిన ఆర్ఎస్పీ.. కేసీఆర్‌పై ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 14:59:58.0  )
RS Praveen Kumar: కృష్ణయ్య కుటుంబాన్ని కలిసిన ఆర్ఎస్పీ.. కేసీఆర్‌పై ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో తాను దళితులకు బంధువుగా ప్రకటించుకుంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ జి.కృష్ణయ్య హత్య కేసులో నిందితులను విడుదల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్పీ ఫైర్ అయ్యారు. కృష్ణయ్య హత్య కేసు నిందితులను బిహార్ సీఎం నితీష్ కుమార్ విడుదల చేస్తుంటే కనీసం బిహార్ ప్రభుత్వానికి లేఖ రాయకపోగా ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని కేసీఆర్ తిరుగుతున్నాడని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో కృష్ణయ్య కుటుంబాన్ని ఆర్ఎస్పీ పరామర్శించారు. కృష్ణయ్య సతీమణి ఉమాదేవి మాట్లాడిన ఆయన కృష్ణయ్య కుటుంబానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బీఎస్పీ పోరాడుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ.10 నుంచి రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచారని ఇప్పుడు వారంతా వందల కోట్ల విలువైన భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు లక్షల కోట్లకు పెరిగాయని ధ్వజమెత్తారు. ఈ మాఫియా గ్యాంగ్‌ను మళ్లీ గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఖతం చేస్తారని అందువల్ల వీరిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న ఒకరోజు నాలుగు పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన ఖండించారు. రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలా రాయగలుగుతారని మండిపడ్డారు. ఈ నెల 30న జరగనున్న టీఎస్ఎన్పీడీసీఎల్ ఏఈ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీపై హైకోర్టు సీజేకి లేఖ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసులో సిట్ అధికారులు అసలైన నిందితులను రక్షిస్తున్నారని ఆరోపిస్తూ ఈ కేసుకు సంబంధించి ఇవాళ హైకోర్టు సీజేకు ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు. పేపర్ లీకేజీ కేసులో అసలైన నిందితులను పట్టుకోవాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించి 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన ద్రోహులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read..

వేసవిలో బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకూడదంటే.. నీటిలో వీటిని కలుపుకుని తాగాల్సిందే?

Advertisement

Next Story