రేపటి నుంచి ఆర్ఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర : BSP

by Nagaya |   ( Updated:2022-12-11 13:56:51.0  )
రేపటి నుంచి ఆర్ఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర : BSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా డిసెంబర్ 12న 141వ రోజు యాత్ర కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కొనసాగనుందని తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే ఈ యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మోసం చేస్తూ, కోట్ల రూపాయలు దోచుకుంటున్న విధానాలను ప్రజలకు వివరించి, వారిని చైతన్యవంతం చేయడానికి యాత్ర చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పేదలను పాలకులుగా చేసి బహుజన రాజ్యం కోసం జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చింది. ఇప్పటివరకు జరిగిన 140 రోజుల యాత్రలో 24 నియోజకవర్గాల్లో 15 వేల కిలోమీటర్లు తిరిగి లక్షలాది మందిని కలిసి వారి బాధలను తెలుసుకుని, బహుజన రాజ్యం యొక్క ఆవశ్యకతను ఆర్ఎస్పీ తెలియజేశారని వివరించింది. ఈ141వ రోజు యాత్ర మానకొండూరు నియోజకవర్గంలోని రేగులపల్లిలో ప్రారంభమై, బెజ్జంకి గ్రామంలో ముగుస్తుందని బీఎస్పీ ప్రకటించింది.

Advertisement

Next Story